ఏపీ ఎల‌క్ష‌న్స్ 2019 : అక్క‌డ టెన్ష‌న్‌.. టెన్ష‌న్‌..!

0
168

కొన్ని స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్ధులు ఇంకా నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయ‌లేదు. దీంతో ఇవాళ చివ‌రి రోజు కావ‌డంతో ఆయా పార్టీలతోపాటు టికెట్ ఆశించి భంగ‌ప‌డి స్వ‌తంత్రులుగా బ‌రిలోకి దిగుతున్న వారు ఒక్క‌సారిగా నామినేష‌న్స్ వేసేందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని బావిస్తున్న అధికారులు ప‌టిష్ట భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ముఖ్యంగా క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీ, వైసీపీ నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. టీడీపీ త‌రుపున రామ‌సుబ్బారెడ్డి, వైసీపీ త‌రుపున సుధీర్‌రెడ్డి అసెంబ్లీ అభ్య‌ర్ధులుగా నామినేష‌న్ వేయ‌నున్నారు. జదీంతో జ‌మ్మ‌ల‌మ‌డుగులో 144 సెక్ష‌న్ విధించ‌డంతోపాటు ఇత‌రులెవ్వ‌రూ ప‌ట్ట‌ణంలోకి రాకుండా చెక్‌పోస్టుల‌ను ఏర్పాటు చేశారు.