కాల్‌మ‌నీ సెక్స్‌రాకెట్‌పై సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

0
190

గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విజ‌య‌వాడ కేంద్రంగా వెలుగు చూసిన కాల్‌మ‌నీ సెక్స్‌రాకెట్ అంశంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా, అమ‌రావ‌తి వేదిక‌గా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్‌లు, ఎస్పీల‌తో సీఎం జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ విజ‌య‌వాడ‌లో కాల్‌మ‌నీ సెక్స్‌రాకెట్ అంశంపై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో కాల్‌మ‌నీ, సెక్స్‌రాకెట్ త‌ర‌హా సంఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూడాల‌ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు, ఎస్పీల‌కు సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి సంఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ఎవ‌రైనా ఫిర్యాదు చేస్తే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అందిన ఫిర్యాదులో ఏ రాజ‌కీయ నాయ‌కులు ఉన్నా విడిచిపెట్టొద్ద‌ని జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు.