జ‌గ‌న్‌ది జ‌ల్సాల పాద‌యాత్ర : సీఎం చంద్రబాబు

0
111

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డి 368 రోజుల‌పాటు నిర్వ‌హించింది పాద‌యాత్ర కాదు… విలాసాల యాత్ర అని ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. కాగా, సీఎం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన దివంగ‌త ముఖ్య‌మంత్రినంద‌మూరి తార‌క రామారావు వ‌ర్ధంతి సంద‌ర్భంగా నిర్వ‌హించాల్సిన కార్య‌క్ర‌మాల‌పై ఇవాళ టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా అన్న‌దాన‌, మెగా ర‌క్త‌దాన శిబిరాల‌ను నిర్వ‌హించాల‌ని సీఎం చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంలోనే వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర గురించి మాట్లాడుతూ తాను కూడా ఏపీ వ్యాప్తంగా 208 రోజుల‌పాటు పాద‌యాత్ర చేశాన‌ని, కానీ, నేను చేసిన పాద‌యాత్ర పేద‌లు, రైతులు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై సాగింద‌ని, కానీ వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర మాత్రం సెల్ఫీలు, వైసీపీ శ్రేణుల‌తో క‌లిసి జ‌ల్సాలు చేసేందుకే ప‌రిమిత‌మైంద‌ని విమ‌ర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, జ‌గ‌న్ ఇద్ద‌రూ కుమ్మ‌క్క‌య్యార‌ని, ఆ విష‌యాన్ని ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్ట‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు.