ఏపీ కేబినేట్ తాజా కీల‌క‌ నిర్ణయాలు..!

0
86

ఏపీ స‌చివాల‌యంలో జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. ప‌లు ప‌త‌కాలు అమ‌ల‌వుతున్న తీరుపై కేబినేట్‌లో చ‌ర్చ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న కార్పొరేష‌న్లలో ల‌బ్ధిపొంద‌ని ఇత‌ర వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వం ద్వారా స‌హాయం అందేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త‌గా ముదిరాజులు, క‌ల్లుగీత కార్మిక స‌హ‌కార సంఘాలు ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అలాగే, కార్పొరేష‌న్ల ప‌నితీరు ప‌రిశీల‌న‌కు ఎఫెక్స్‌క‌మిటీని ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఇప్ప‌టికే డ్రైవ‌ర్ల కోసం ప్ర‌త్యేక సాధికార సంస్థ ఏర్పాట చేసిన ప్ర‌భుత్వం రూ.10 కోట్ల మూల నిధితో దానికి ఆమోదం తెలిపింది. ఎక్సైజ్‌శాఖ‌లో 25 ఏళ్లుగా ప‌దోన్న‌తుల‌కు నోచుకోని కానిస్టేబుళ్ల‌కు హెడ్స్‌గా ప్ర‌మోష‌న్స్ ఇచ్చేందుకు మంత్రివ‌ర్గం అంగీకారం తెలిపింది.

ఇక అగ్రిగోల్డ్ బాధితుల ప‌రిహారం పంపిణీపైనా కేబినేట్‌లో చ‌ర్చ జ‌రిగింది. ప‌దివేల‌లోపు ఖాతాలున్న 8,732 మంది బాధితుల‌కు త్వ‌ర‌గా చెల్లింపులు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించింది. సింహాచ‌లం భూముల విష‌యంలో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను మంత్రివ‌ర్గ ఉప సంఘానికి అప్ప‌గించింది. అమ‌రావ‌తిలో జ‌ర్న‌లిస్టుల ఇళ్ల నిర్మాణంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల రాయితీల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని కేబినేట్ నిర్ణ‌యించింది.