‘ఈసీ’ షరతులతో మొదలైన.. ఏపీ కేబినెట్ భేటీ..! ప్రధానాంశాలివే

0
90
ap cabinate meeting 2019

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత ఎట్టకేలకు ఏపీ మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన కేంద్ర ఎలక్షన్ కమిషన్ కేబినెట్ భేటీ కి అనుమతిని ఇవ్వడంతో పాటు కొన్ని షరతులను విధించింది. బిల్లుల చెల్లింపులు, ధరల పెంపులను, కొత్త నిర్ణయాలను మాత్రం సమావేశంలో చర్చించవద్దని తెలిపింది.

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో మంత్రులు, పలు శాఖల యొక్క ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కరవు, ఫోని తుఫాన్, తాగునీటి సమస్య, ఉపాధి హామీ కూలీలా లాంటి నాలుగు అంశాల మీద చర్చించనున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఏపీ కేబినెట్ భేటీకి మంత్రులు యనమల, పితాని సత్యనారాయణ, ఆదినారాయణరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి , ఎండీ ఫరూక్ గైర్హాజరయ్యారు.