బీజేపీ బాసులకు షాక్ ఇచ్చిన ఏపీ నేత.!

0
177

ఏపీలో బీజేపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదని కుండ బద్దలు కొట్టారు ఏపీ బీజేపీ నేత, ఎం‌ఎల్‌ఏ విష్ణుకుమార్ రాజు. అయితే, దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి 30 ఎంపీ స్థానాలు వస్తాయని పక్క సమాచారం వుందని అన్నారు.

ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి దేశ వ్యాప్తంగా ఎంపీ సీట్లు అధిక సంఖ్యలో వస్తాయని తేలడంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువైందని సెటైర్ వేశారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలన్న వారి కలలు కల్లలేనని విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యానించారు.