భ‌ద్రాచ‌లం ఆదాయంపై ఏపీ అసెంబ్లీలో వార్..!

0
127

త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో వ్య‌వ‌సాయ‌రంగం 10.24 శాతం మేర వృద్ధిని సాధించింద‌ని, అదే ఇప్ప‌టికీ కొన‌సాగుతుంద‌ని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. అసెంబ్లీ స‌మావేశాలో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ ఏపీ అభివృద్ధిలో కొన‌సాగుతుంద‌న్న విష‌యాన్ని స్వ‌యాన ప్ర‌ధాని మోడీనే సీఎం జ‌గ‌న్‌కు చెప్పార‌ని బుచ్చ‌య్యచౌద‌రి అన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల వాద‌న‌కు బుచ్చ‌య్య‌చౌద‌రి స‌మాధాన‌మిస్తూ రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జ‌మేన‌ని, ఎన్నిక‌ల్లో ఎప్పుడైనా, ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని అన్నారు. త‌మ ప్ర‌భుత్వ హ‌యాం నుంచే కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌లేద‌ని, ఆ కార‌ణంగానే ఏపీ ఇప్ప‌టికీ రూ.12వేల కోట్ల లోటు బ‌డ్జెట్‌లో ఉంద‌ని ఆయ‌న అన్నారు.

అలాగే భ‌ద్రాచ‌లం గురించి.. మాట్లాడుతూ భ‌ద్రాచ‌లం ఆదాయం తెలంగాణ ప్రాంతానిది కాద‌ని, కానీ ఇప్పుడు పూర్తిగా తెలంగాణ ప్ర‌భుత్వ కంట్రోల్‌లోకి వెళ్లింద‌ని బుచ్చ‌య్య చౌద‌రి అన్నారు. బుచ్చ‌య్య‌చౌద‌రి అన్న ఈ వ్యాఖ్య‌ల‌కు వెంట‌నే స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేత‌ల‌కు భ‌ద్రాచ‌లం ఇప్పుడు గుర్తొచ్చిందా..? అని ప్ర‌శ్నించారు. మొన్న‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న‌ది మీరే క‌దా..! అప్పుడు గుర్తుకు రాని భ‌ద్రాచ‌లం.. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటూ శ్రీ‌కాంత్‌రెడ్డి ఫైర‌య్యారు.