సైరా సెట్ లో దేవసేన హల్చల్ ..!

0
248
anushka shetty will join in syeraa shooting

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతని సొంత బ్యానర్ లో కోణిదెల ప్రొడక్షన్ కంపెనీ పరంగా 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ‘సైరా’. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాను తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు.

బ్రిటిష్ సైనికులతో పోరాటం చేసిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ దాదాపుగా చివరి దశకు వచ్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవివి నటించగా, ఆయన భార్యగా నయనతార నటిస్తుంది. మరో హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. భగవాన్ వెంకన్నా, బాలీవుడ్ ప్రముఖ నటుడు బిగ్ బి, విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచా సుదీప్, ప్రగ్య జైస్వాల్, బ్రహ్మజీ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

మరో ప్రముఖమైన పాత్రలో అనుష్కను తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అనుష్క మాత్రం ఏం చెప్పకుండా మూడు నెలల నుంచి సైరా టీమ్ ని కంగారు పెట్టింది. ఎట్టకేలకు ఇప్పుడు ఓకే చెప్పిందట. మేకప్ వేసుకొని బుధవారం సైరా సెట్ కి రాబోతుంది. దీంతో చిరంజీవి ఊపిరి పీల్చుకున్నాడు.

‘సైరా’ సినిమా లో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి అనుష్క పాత్ర ఒక నారేటర్ గా ఉండనుంది. ఆమె కథ చెప్తుంటే కథ మొదలయ్యే ప్రధాన పాత్రను చేస్తుంది. అనుష్క ఈ ఏడాదికి గాను మాధవన్ నటిస్తున్న ‘నిశ్శబ్దం’ సినిమాకు ఓకే చెప్పింది. ఆ తర్వాత అనుష్క చేయబోయే సినిమా ఇదే. దీని తర్వాత సంతోష్ శివన్ దర్శకత్వంలో లార్డ్ అయ్యప్ప కథతో సాగే చిత్రం లో చేయనుందట.