అమెరికాలో అనుష్క సినిమా లాంచ్ ..!

0
217

దర్శకుడు హేమంత్ మధుకర్ ముద్దుగుమ్మ అనుష్క ప్రధాన పాత్రధారిగా థ్రిల్లర్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం అమెరికా వెళ్లింది. దాదాపుగా అమెరికాలోనే ఎక్కువ భాగం షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. తాజాగా చిత్ర షూటింగ్ అమెరికాలో ప్రారంభమైంది.

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తముగా నిర్మిస్తున్న సినిమాలో మాధవన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా షాలిని పాండే కూడా ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. చిత్రాన్ని వివిధ భాషలలో రిలీజ్ చేయుటకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తో, ఇంగ్లిష్ లో ‘సైలెన్స్’ అనే పేరు ఖరారు చేశారు. ఇలాంటి అర్ధం వచ్చే విధంగా ఇతర భాషలలో సినిమా పేరు ఖరారు చేయనున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.