“దేవసేన” అనుష్క న్యూ లుక్ అధిరింది

0
101

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అనుష్క ఎంత స్లిమ్ గా ఉండేదో అందరికీ తెలిసిందే.. అలాంటి ఈ బ్యూటీ “సైజ్‌ జీరో” సినిమా కోసం చేసిన ప్రయోగం వికటించింది.. ఎంత త్వరగా స్లిమ్ అవుదామన్న ఆమె వల్ల కాలేదు.. దాంతో చేసేది లేక “బాహుబలి 2” షూట్ టైమ్ లో దర్శకుడు రాజమౌళి అనుష్క అందాలని గ్రాపిక్స్ లో చూపించాడు. దానివల్ల ఆమె గ్లామర్ లో రియాలిటీ లోపించింది. సినిమా సూపర్ హిట్ అయిన అనుష్క అభిమానులు మాత్రం నిరాశ చెందారు.

దాంతో ఎలాగైనా తన అభిమానులు కోరుకున్న ఫిగర్ సొంతం చేసుకోవాలి అని భావించిన దేవసేన ఏ అవకాశం వచ్చిన తిరస్కరించి స్లిమ్ అయ్యే పనిలో పడింది.. దాంతో అనుష్క ఏమైంది ? అంటూ ఆమె అభిమానులు ఆమెకు సంబందించిన అప్ డేట్స్ కోసం వైట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి టైమ్ లో అనుష్క షాక్ ఇచ్చింది.

అనుష్క శెట్టి ఇంత అందంగా తయారయ్యిందా ? అని అందరూ నోర్లు తెరిచేలా తన కొత్త లుక్ ని రిలీజ్ చేసింది ఈ బ్యూటీ. తాజాగా జరిగిన ఈ “ఫొటో షూట్‌” పోటోస్ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అవి చూసిన ప్రతి ఒక్కరూ “అనుష్క ఈజ్‌ బ్యాక్‌” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ట్విటర్‌ ట్రెండింగ్‌ లో ఉన్నాయి. స్వీటీ తెలుపు వర్ణం దుస్తుల్లో సముద్రం ఒడ్డున కూర్చుని ఎంతో అందంగా కనిపించారు. ఫొటోగ్రాఫర్‌ “సుందర్‌ రాము” క్లిక్‌ మానిపించిన ఈ ఫోటోలను చూసి ఆమె అభిమానులు “దేవసేన” న్యూ లుక్ అధిరింది అంటున్నారు.