తెరవెనుక చేయాల్సిన పనులెన్నో..!అనుష్క శర్మ

0
303
anushka sharma latest news

బాలీవుడ్ అమ్మడు అనుష్క శర్మ గత సంవత్సరం ‘జీరో’ సినిమా  తరువాత ఇప్పటివరకు మరో మూవీ ఒప్పుకోలేదు. దీనికి ఒక ఇంటర్వ్యూ లో ఆమె స్పందిస్తూ..  సినిమాకన్నా నేను చేయవల్సిన పనులు ఉన్నాయి. ఆ పనులను చేయడం కోసమే గతేడాది నుంచి ఇప్పటివరకు ఏ సినిమాకు సైన్ చేయలేదు.

2018లో ‘పారి’, ‘సూయీ ధాగా’, ‘జీరో’ చిత్రాలలో నటించాను. ఈ మూడు సినిమాలలో డిఫరెంట్ పాత్రలను పోషించాను. ఇలా డిఫరెంట్ పాత్రలలో చేయాలంటే చాలా ప్రిపరేషన్ అవసరం. అందుకే ఇప్పుడు నాకున్న పనులకు, నేను ప్రిపేర్ అవడం.. సినిమాలు చేయడము ఇప్పట్లో కుదరదు. ఈ కారణంగానే చేతికి వస్తున్న ఆఫర్స్ ను ఒప్పుకోలేకపోతున్నాను.

ఒక వైపు నటిగా చేస్తూనే .. మరో వైపు నిర్మాతగా వ్యవహరిస్తున్నాను .. ప్రస్తుతానికి ఒక మూవీ తో పాటు.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కార్యక్రమాలను నిర్మిస్తున్నాను. దీనికి కూడా టైం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా తెర మీదే కాకుండా తెర వెనక చేయాల్సిన పనులున్నాయంటూ ముగించింది.