టీ కాంగ్రెస్ కు మరో షాక్ : TRS గూటికి ఉపేందర్‌ రెడ్డి

0
93
టీ కాంగ్రెస్ కు మరో షాక్ : TRS గూటికి ఉపేందర్‌ రెడ్డి
టీ కాంగ్రెస్ కు మరో షాక్ : TRS గూటికి ఉపేందర్‌ రెడ్డి

నామినేషన్ ప్రక్రియ దగ్గర పడడం, కొన్ని ముఖ్యమైన సీట్ల సర్దుబాటుపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పిరాయింపుల జోరు మరింత పెరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుంది ? ఎవరు పార్టీ మారుతున్నారో అర్దం కానీ పరిస్థితి.. గంట క్రితం పార్టీ మారేది లేదు అని చెప్పిన నాయకుడు కూడా మీకు సీటు కష్టం అంటే చాలు నిమిషాల్లో పార్టీ కండువా మార్చేస్తున్నారు మన నేతలు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో తెలంగాణ “టీ కాంగ్రెస్‌ పార్టీ”కు మరో షాక్‌ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరో MLA కూడా కాంగ్రెస్‌ ను వీడి TRSలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో “తుమ్మల నాగేశ్వరరావు”పై గెలుపొందిన “కందాళ ఉపేందర్‌ రెడ్డి” ఇప్పుడు TRSలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. గురువారం ఆయన TRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారని తెలుస్తుంది.

గత కొంతకాలంగా MLA ఉపేందర్‌ రెడ్డితో, TRS నేతలు టచ్‌ లోనే  ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ ను వీడి టి‌ఆర్‌ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం వచ్చే ఎన్నికల్లో కూడా TRS సీటు “ఉపేందర్‌ రెడ్డి”కే ఇస్తాం అని హామీ లభించడంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే TRS లో చేరానున్న “ఉపేందర్‌ రెడ్డి” అవసరమైతే తన MLA పదవికి రాజీనామా చేసి “TRS బీ ఫారం”పై పోటీచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.