శ‌బ‌రిమ‌ల‌లో మ‌రో క‌ల‌క‌లం..!

0
217

రెండు రోజుల క్రితం శ‌బ‌రిమ‌ల‌లో వెల‌సిన అయ్య‌ప్ప‌స్వామిని ఇద్ద‌రు మ‌హిళ‌లు ద‌ర్శించుకోవ‌డంతో ఇప్ప‌టికే కేర‌ళ అంతా అట్టుడుకుతోంది. శ‌బ‌రిమ‌ల‌లోకి మ‌హిళ‌ల ప్ర‌వేశాన్ని నిర‌సిస్తూ ఇప్ప‌టికే హిందుత్వ సంఘాలు ఆందోళ‌న‌లు చేస్తున్నాయి. నిన్న‌టికి నిన్న బీజేపీ కార్య‌క‌ర్త‌లు వామ‌ప‌క్షాల శ్రేణుల మ‌ధ్య ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. క‌త్తిపోట్ల‌తో ఒక‌రు మృతి చెంద‌గా మ‌రో వ్య‌క్తికి తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది.

ఇదిలా ఉండ‌గా, శ‌బ‌రిమ‌ల‌లో అయ్య‌ప్ప‌స్వామిని ద‌ర్శించుకునేందుకు శ్రీ‌లంక‌కు చెందిన ఓ మ‌హిళ విశ్వ ప్ర‌య‌త్నం చేసింది. తెల్ల‌వారుజామున త‌న భ‌ర్త‌తో క‌లిసి 18 మెట్ల వ‌ర‌కు వెళ్లింది. ఈ క్ర‌మంలో అయ్య‌ప్ప భ‌క్తులు ఆందోళ‌న‌కు దిగ‌డంతో పోలీసులు ఆమెను ఆపేశారు. మ‌హిళ‌ల ప్ర‌వేశంపై ఒక‌వైపు కేర‌ళ అట్టుడుకుతుంటే మ‌రోవైపు ఇంకో మ‌హిళ స్వామివారి ద‌ర్శనానికి వెళ్ల‌డంపై హిందూ సంఘాలు మండిప‌డుతున్నాయి.

శ్రీ‌లంక జాతీయురాలిగా చెప్పుకున్న మ‌హిళ త‌న పేరును చెప్పేందుకు నిరాక‌రించారు. తాను అయ్య‌ప్ప భ‌క్తురాలిన‌ని, త‌న‌కు దేవుడ్ని ద‌ర్శించుకునే హ‌క్కు ఉంద‌ని తెలిపింది. ద‌ర్శ‌నానికి ముందే పోలీసుల‌కు త‌న మెడిక‌ల్ స‌ర్టిఫికేట్ ఇచ్చిన‌ట్టు వెళ్ల‌డించింది. అయితే, దేవుడ్ని ద‌ర్శించుకునేందుకు ఆంక్ష‌లు ఏమిటంటూ ఆమె ప్ర‌శ్నిస్తోంది.

కేర‌ళ‌లో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించ‌డంతో గ‌వ‌ర్న‌ర్ సీరియ‌స్ అయ్యారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిపై స‌మ‌గ్ర నివేద‌క ఇవ్వాల‌ని సీఎం పిన‌రై విజ‌య‌న్‌ను ఆదేశించారు.