వైసీపీ చ‌రిత్ర‌లో ఆవిష్కృతం కాబోతున్న మ‌రో చారిత్రాత్మక ఘ‌ట్టం..!

0
309

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర క్లైమాక్స్‌కు చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 9వ తేదీతో జ‌గ‌న్ పాద‌యాత్ర ముగియ‌నుంది. ఈ చారిత్ర‌క ఘ‌ట్టానికి ఘ‌న‌మైన ముగింపును ఇచ్చేందుకు వైసీపీ సిద్ధ‌మ‌వుతోంది. అందు కోసం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర హైలెట్స్‌తో భారీ స్థూపాన్ని సిద్ధం చేసింది.

ముగింపు స‌భ కోసం పెద్ద ఎత్తున జ‌న స‌మీక‌ర‌ణకు వైసీపీ శ్రేణులు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తున్నారు. పాదయాత్ర చివ‌రి రోజున వైఎస్ జ‌గ‌న్ ఈ స్థూపాన్ని ఆవిష్క‌రించనున్నారు. జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పైలాన్‌గా ఈ స్థూపాన్ని నిర్మిస్తున్నారు. పునాది నుంచి స్థూపం బేస్ వ‌ర‌కు 13 జిల్లాల‌ను సూచిస్తూ 13 మెట్లు నిర్మించారు.

అలాగే, నాలుగు పిల్ల‌ర్ల‌పై 3 అంతస్థుల్లో స్థూపం ఉంటుంది. మొద‌టి అంత‌స్థుల్లో జ‌గ‌న్ పాద‌యాత్ర ఫోటోలు, రెండో అంత‌స్థులో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఫోటోలు ఉంచేలా ప్ర‌త్యేకంగా నిర్మిస్తున్నారు. వృత్తాకార ఆకారంలో ఉండే చివ‌రి అంత‌స్థు డోర్ నుంచి 15 అడుగుల ఎత్తులో పార్టీ ప‌థ‌కాన్ని ఎగుర‌వేస్తారు. స్థూపానికి చుట్టూ ఉన్న ప్ర‌హ‌రీగోడపై పాద‌యాత్ర విశేషాలు ఉండేలా వైసీపీ శ్రేణులు ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తున్నారు.