బిగ్ బ్రేకింగ్ : కొలంబో ఎయిర్‌పోర్టు స‌మీపంలో మ‌రో బాంబు గుర్తింపు..!

0
173

శ్రీ‌లంక‌లో ఉగ్ర‌వాదులు మార‌ణ హోమం సృష్టించారు. ఈస్ట‌ర్ నాడు బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల‌తో ర‌క్త‌పుటేరులు పారించారు. దాదాపు కొలంబోలోని ఎనిమిది చోట్ల ముష్క‌రులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘోరంలో 290 మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భార‌తీయులు స‌హా 33 మంది విదేశీయులు ఉన్నార‌ని స‌మాచారం. అయితే, కొలంబోలో ర‌క్తాన్ని ఏరులై పారించింది నేష‌న‌ల్ తౌవిద్ జ‌మాత్ అనే ముస్లిం ఏర్పాటు వాద సంస్థ అని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్రార్ధనా మందిరాలు, హోట‌ల్సే టార్గెట్‌గా ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డ్డారు. ప‌దేళ్ల ప్ర‌శాంత‌త‌కు తూట్లు పొడుస్తూ ఈ ద్వీప దేశంలో మ‌ళ్లీ నెత్తురు ఎగ‌జిమ్మింది. ప‌విత్ర ఈస్ట‌ర్ రోజున ప్ర‌త్యేక ప్రార్ధ‌న‌లు నిర్వ‌హిస్తున్న చ‌ర్చీల‌తోపాటు, హోట‌ళ్లను ఉగ్ర‌వాదులు టార్గెట్ చేశారు. తాజాగా, ఈ రోజు కొలంబో ఎయిర్‌పోర్టు స‌మీపంలో మ‌రోబాంబును పోలీసులు గుర్తించారు. ఆ బాంబును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.