బీజేపీలోకి గుంటూరు జిల్లా సీనియ‌ర్ నేత‌..!

0
117

గుంటూరు జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా పేరొందిన అన్నం స‌తీష్ కాసేప‌టి క్రితం బీజేపీలో చేరారు. కాగా, ఇటీవ‌ల ఆయ‌న టీడీపీ స‌భ్య‌త్వానికి, ఆ పార్టీ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. బీజేపీలో చేరేందుకు వ‌చ్చిన అన్నం స‌తీష్‌ను ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ జేపీ న‌డ్డా సాద‌రంగా ఆహ్వానించారు. అంత‌కు ముందు రోజు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి జీ.కిష‌న్‌రెడ్డిని అన్నం స‌తీష్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన విష‌యం విధిత‌మే.

కాగా గుంటూరు జిల్లాలో సీనియర్‌ నేతగా పేరొందిన సతీష్‌.. పార్టీకి రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. 2014 ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీచేసిన సతీష్‌.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన ఎమ్మెల్సీ పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.