అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌నం.. ఓట‌మిని ఒప్పుకున్న‌ట్టేనా..?

0
309

గ‌త నెల 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఫ‌లితాలు ఈ నెల 23న వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో ఓట‌ర్ల తీర్పు ఎలా ఉండ‌నుంద‌న్న అంశంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొని ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులుగా పోటీచేసిన వారిలో రోజు రోజుకు టెన్ష‌న్ ఎక్కువవుతోంది. దీంతో తాము పోటీచేసిన నియోజ‌క‌వ‌ర్గంలోని బూత్‌స్థాయి నేత‌ల నుంచి నేత‌ల వ‌ర‌కు నివేదిక‌లు తెప్పించుకుని అంత‌ర్గ‌త స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి వేదిక‌గా మంత్రి నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారాయి. అయితే, ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న నెల్లూరు టౌన్ టీడీపీ టికెట్‌పై ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా పోటీచేసిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ టికెట్‌పై ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ మ‌ళ్లీ బ‌రిలో నిలిచారు. టీడీపీ నుంచి మంత్రి, వైసీపీ నుంచి రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన అనీల్ కుమార్ యాద‌వ్ బ‌రిలో ఉండ‌టంతో నెల్లూరు టౌన్ గెలుపోట‌ముల‌పై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

కాగా, అమ‌రావ‌తి వేదిక‌గా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయ‌ణ త‌న ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి రాజ‌కీయంగా త‌న‌కంటే బ‌ల‌వంతుడ‌ని, నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే తిరుగుతూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేశాడ‌ని చెప్ప‌డం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచ‌ల‌నంగా మారాయి. మంత్రి నారాయణ వ్యాఖ్య‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు అనీల్ కుమార్ యాద‌వ్‌పై మంత్రి ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారంటూ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.  మ‌రోప‌క్క మంత్రి నారాయ‌ణ‌పై అనీల్ కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న విజ‌యం సాధించ‌నున్నారంటూ వైసీపీ శ్రేణులు ఇప్ప‌టి నుంచే సంబ‌రాలు చేస్తున్నారు.