మంత్రి అనీల్‌కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

0
286

ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు సంబంధించి అసెంబ్లీలో చ‌ర్చించాల్సిన అంశాల‌కు సంబంధించి ఈ రోజు బీఏసీ స‌మావేశం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్, క‌న్న‌బాబు, అనీల్‌కుమార్ యాద‌వ్ పాల్గొన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

స‌మావేశం ముగిసిన అనంత‌రం అనీల్‌కుమార్ యాద‌వ్ స‌మావేశంలో జ‌రిగిన అంశాల‌ను మీడియా ముందు ప్ర‌స్తావించారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో తాము ప‌లు అంశాల‌ను అసెంబ్లీలో చ‌ర్చించేందుకు పేర్కొనాలంటూ ప్ర‌తిపాదిస్తే.. ఏ ఒక్క రోజు కూడా త‌మ అంశాల‌ను చ‌ర్చ‌కు రానివ్వ‌కుండా నాడు అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అడ్డుకుంద‌న్నారు.

కానీ, నేడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా వైసీపీ అధికారంలో ఉంద‌ని, ఎటువంటి ప‌క్ష‌పాత ధోర‌ణి లేకుండా ప్ర‌తిప‌క్ష‌హోదాలో ఉన్న టీడీపీ త‌రుపున చ‌ర్చ‌కు పెట్టాలంటూ ప్ర‌తిపాదించిన అంశాల‌ను క‌చ్చితంగా అసెంబ్లీలో ప్ర‌స్తావిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే అసెంబ్లీ స‌మావేశాల రోజులు పెంచేందుకు కూడా త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని, ఆ మేర‌కు వారమా..? ప‌దిరోజులా..? అన్న అంశాల‌కు సంబంధించి ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ప‌నిదానాలు పెంచుతామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పార‌న్నారు.