చిరాకొచ్చి మెట్రో ఎక్కేసిన నితిన్‌

0
152

టాలీవుడ్‌ హీరో నితిన్‌కి హైద‌రాబాద్‌ ట్రాఫిక్‌తో చిరాకొచ్చింది. దీంతో కారు అక్క‌డే వ‌దిలేసి ర‌సూల్ పురా స్టేష‌న్లో మెట్రో ఎక్కేశాడు. నితిన్‌ను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు. ఈ ఘ‌ట‌న‌పై నితిన్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘రోడ్డుపై విపరీతమైన ట్రాఫిక్‌ ఉంది.

అందుకే సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత ట్రాఫిక్‌ సమస్య నుంచి బయటపడేందుకు మెట్రోను ఎంచుకున్నా. ఈ అనుభూతి ఎంతో నచ్చింది’ అని నితిన్ చెప్పుకొచ్చాడు. ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా తర్వాత నితిన్ ప్ర‌స్తుతం ‘భీష్మ’లో నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకుడు. రష్మిక హీరోయిన్‌. రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైన సంగ‌తి తెలిసిందే.