అమరావతిలో అప్రమత్తమైన ఏర్పాట్లు ..!

0
131

ఏపీ ఎన్నికల ఫలితాల సమయంలో సచివాలయంలో అధికారులంతా అప్రమత్తం అయ్యారు. కట్టు దిట్టమైన భద్రతలను ఏర్పాటు చేయాలనీ పోలీస్ ఉన్నత అధికారులాదేశించారు. సీఎం కార్యాలయము తో కలిపి సచివాలయం నుండి ఏ విధమైన ఫైల్స్ బయటకు వెళ్లకూడదని సెక్యురిటి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదివరకే ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ బోర్డ్ తో సహా కొన్ని శాఖ లలో ముఖ్యమైన ఫైల్స్ ధ్వంసం చేశారని ఇంటెలిజెన్స్ సమాచారం . ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా కొనసాగిన చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశము నిర్వహించారు. దీనిపై ఎన్నో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందె. ఈ సమావేశంలో అతని మద్దతుదారులకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకున్నారని ఆరోపణలు తలెత్తాయి.

ఇంకో వైపు వైఎస్‌ జగన్‌, చంద్రబాబు ల ఇంటి వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలను శాంతియుతంగా నిర్విహించినందుకు గాను సిబ్బంది వారికి సెంట్రల్ ఎలక్షన్ పరిశీలకుడు కేకే శర్మ అభినందనలను తెలిపాడు. ఎన్ని ఒత్తిడులు ఎదురైనా నిష్పక్షపాతంగా ఉన్నందుకు వారిని ప్రశంసించాడు.