ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల : రైతుల ఖాతల్లో డబ్బులు

0
213
ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల : రైతుల ఖాతల్లో డబ్బులు
ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడత రుణమాఫీ నిధులు విడుదల : రైతుల ఖాతల్లో డబ్బులు

మరికొన్ని గంటల్లో ఎన్నికల పోలింగ్ జరగనున్న ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతుల రుణమాఫీ నాలుగో విడత నిధులను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నాలుగో విడత కింద 31.44లక్షల ఖాతాలకు రూ.3,979.46 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ నెల 8వ తేదీన రుణ ఉపశమన అర్హత పత్రంతో సుమారు 2లక్షల మంది రైతులు బ్యాంకులకు వెళ్లి తమ పేరు నమోదు చేసుకున్నారు.

అలా నమోదు చేసుకున్న 24 గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.282 కోట్లు బ్యాంకులకు పంపి ఆ నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ఇవేకాక మంగళవారం కూడా సుమారు 4.49లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకోగా వారి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.519 కోట్లు మంజూరు చేసింది. మరికొన్ని గంటల్లో ఈ నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలుస్తుంది.