వైఎస్ జ‌గ‌న్ : 17 మంది మంత్రుల పేర్లు ఖ‌రారు..!

0
588

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రివర్గ విస్త‌ర‌ణ‌పై క‌స‌ర‌త్తును ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి దాదాపుగా పూర్తి చేశాడ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ కేబినేట్‌లో చోటు ద‌క్కించుకోబోయేది ఎవ‌రు..? అన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డాలంటే మ‌రో రెండు రోజుల‌పాటు ఆగ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

అయితే, వైసీపీ అధికారంలోకి వ‌స్తే మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తాన‌ని ఆ పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ గ‌తంలో హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. వారితోపాటు జిల్లాల వారీగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల్లో భాగంగా మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్న వారి జాబితా కూడా భారీగానే ఉంది. ఇదిలా ఉండ‌గా జ‌గ‌న్ త‌న కేబినేట్ కూర్పులో భాగంగా 17 మంది పేర్ల‌ను క‌న్ఫామ్ చేశాడ‌న్న క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వాటి వివ‌రాల ప్ర‌కారం జ‌గ‌న్ కేబినేట్‌లో చోటు ద‌క్క‌నున్న‌వారికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి…

# పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి (చిత్తూరు)
# బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి (క‌ర్నూలు)
# ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (గుంటూరు)
# బొత్స స‌త్య‌నారాయ‌ణ (విజ‌య‌న‌గ‌రం)
# పుష్ప శ్రీ‌వాణి (విజ‌య‌న‌గ‌రం)
# ధ‌ర్మాన ప్ర‌సాద్ (శ్రీ‌కాకుళం)
# అవంతి శ్రీ‌నివాస్ (విశాఖ‌)
# దాడిశెట్టి రాజా (తూర్పు గోదావ‌రి)
# సుభాష్ చంద్ర‌బోస్ (తూర్పు గోదావ‌రి)
# ప్ర‌సాద రాజు (ప‌శ్చిమ గోదావ‌రి)
# సుచ‌రిత (గుంటూరు)
# బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి (ప్ర‌కాశం)
# అనంత వెంక‌ట‌రామిరెడ్డి (అనంత‌పురం)
# అంజాద్ బాష (క‌డ‌ప‌)
# కొడాలి నాని (గుడివాడ‌)
# అనీల్ కుమార్ యాద‌వ్ (నెల్లూరు సిటీ)
# మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి (ఆత్మ‌కూరు)