ఎఫ్‌3లో యాంక‌ర్ సుమ – కోసి కారం పెట్టాల్సిందే..!

0
5954

అవును, మీరు చ‌దివింది అక్ష‌రాల స‌త్యం. ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ క‌న‌కాల త్వ‌ర‌లో షూటింగ్ జ‌రుపుకోనున్న ఎఫ్‌3లో పాల్గొన‌నున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఎఫ్‌2 మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా హీరో వ‌రుణ్ తేజ్ హీరోలుగా, త‌మ‌న్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్‌లు న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద క‌న‌క వ‌ర్షాన్ని కురిపించింది. దీంతో ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి మ‌హేశ్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం త‌రువాత ఎఫ్‌3ని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నారు.

ఇక అస‌లు విష‌యానికొస్తే, సుమ క‌న‌కాల న‌టించ‌నుంది ఎఫ్‌3 మూవీలో కాదు. ఎఫ్‌3 సెల‌బ్రెటీల షోలో. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సంబంధింత ప్ర‌ముఖ ఛానెల్ ప్ర‌మోష‌న్ వీడియోను సైతం విడుద‌ల చేసింది. ఈ వీడియోలో స‌న్నివేశాలు ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. ముందుగా బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌డ్రాప్‌లో టీవీ ప్రోగ్రామ్‌లు చూస్తున్న బామ్మ‌కు ఏ ఛానెల్ చూడాలో తెలీక రిమోట్ తెగ నొక్కేస్తుంటుంది. అదే స‌మ‌యంలో మా సంసారంలో శ‌నిలా దాప‌రించింద‌మ్మా.. మా అత్త‌.. అయ్యో.. అంటూ టీవీ వాయిస్‌. కొద్దిసేప‌టికే బామ్మ టీవీ ఛానెల్ ఛేంజ్‌.. మ‌రో ఛానెల్‌లో కూర‌గాయ‌లు ఇలా .. అన‌గానే.. కోసి కారంపెట్టాలంటూ బామ్మ కౌంట‌ర్ ఇలా ఫ‌న్నీ డైలాగ్‌లో వీడియో ఎంతో ఆక‌ట్టుకుంటోంది.

కొద్దినిమిషాల‌కే అవాక్క‌య్యారా..? అంటూ ఎంట‌రైన సుమ ఆ ఇంట్లో రొటీన్ ప్రోగ్రామ్‌ల‌తో ఇబ్బందిప‌డుతున్న ప్రేక్ష‌కుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుంది. చెప్పండి మీకు ఎలాంటి షో కావాలి..? సెల‌బ్రిటీ షోనా..? ఫ‌్యామిలీ షోనా..? సెల‌బ్రిటీ విత్ ఫ్యామిలీ షోనా..? లేక సెల‌బ్రిటీ విత్ ఫ్యామిలీ ఫ‌న్ ఫ్ర‌స్టేష‌న్ అయితే మీకేమ‌న్నా ప్రాబ్ల‌మా..? అంటూ ప్ర‌ఝ‌శ్న‌ల‌పై ప్ర‌శ్న‌లు సంధిస్తూ క‌న్ఫ్యూజ్ చేస్తుంది. ఇలా ఎన్నో విశేషాల‌తో రానున్న ఎఫ్‌3 షో అతి త్వ‌ర‌లో బుల్లితెర‌పై ప్ర‌సారం కానుంది.