వామ్మో.. మ‌మ్ముట్టినా..? : అన‌సూయ‌

0
130

2009 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నిర్వ‌హించిన పాద‌యాత్రను బేస్ చేసుకుని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌హి వీ రాఘ‌వ్ యాత్ర పేరుతో చిత్రాన్ని తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. గ‌త శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ చిత్రం సినీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుంటూ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

యాత్ర చిత్రంలో గౌరు సుచ‌రితారెడ్డి పాత్ర‌లో న‌టించిన యాంక‌ర్ క‌మ్ న‌టి అన‌సూయ షూటింగ్‌లో స‌మ‌యంలో జరిగిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా ఆమె అభిమానుల‌తో పంచుకుంది. గౌరు సుచ‌రితారెడ్డి వంటి ఎంతో ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ను త‌న‌ను నమ్మి ఇచ్చినందుకు ద‌ర్శ‌కుడు మ‌హి వీ రాఘ‌వ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

ఇక వైఎస్ఆర్ పాత్రలో న‌టించిన మ‌మ్ముట్టి గురించి మాట్లాడుతూ.. ఆయ‌న్ను వ‌ర్ణించేందుకు నాకు మాట‌లు దొర‌క‌డం లేదు. ఆయ‌న గురించి ఎంత మాట్లాడుకున్నా స‌మ‌యం స‌రిపోద‌ని, ఆయ‌న న‌ట‌న అద్భుత‌మ‌న్నారు. వెండితెర‌పై వైఎస్ఆర్  మేన‌రిజాన్ని అచ్చుగుద్దిన‌ట్లు దించేశారంటూ మ‌మ్ముట్టి త‌న‌కున్న అభిమానాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు తెలిపింది అన‌సూయ‌.