అమెరికా స‌ర్వే సంస్థ : ఏపీ రాజ‌కీయాల్లో బాంబు పేల్చిందిగా..!

0
718

ఈ ఏడాది ఏప్రిల్ 11న జ‌ర‌గిన సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేందుకు ఇంకా 14 రోజుల స‌మయం ఉన్న నేప‌థ్యంలో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల్లో ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయ ప్ర‌త్యర్ధుల మ‌ధ్య మాట‌ల తూటాలు కూడా అంతే స్థాయిలో పేలుతున్నాయి.

అయితే, గ‌త కొంత కాలం నుంచి టీడీపీ నేత‌లకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుందంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుండ‌గా, పోలింగ్ స‌ర‌ళి నివేదికల‌ను తెప్పించుకున్న వైఎస్ జ‌గ‌న్ వైసీపీ ఓట‌మి త‌ధ్య‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వ‌డంతో హైద‌రాబాద్‌లోని లోట‌స్‌పాండ్ నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నార‌ని టీడీపీ విమ‌ర్శిస్తోంది.

ఇలా ఏపీ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న వేళ అమెరికాకు చెందిన ఓ స‌ర్వే సంస్థ చేసిన‌ స‌ర్వే ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. అమెరికాకు చెందిన ఓ స‌ర్వే సంస్థ నివేదిక ప్ర‌కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 103 సీట్ల‌ను క‌చ్చితంగా గెలుపొందుతుందంటూ ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది.

ఇక, కేంద్రంలోను బీజేపీనే మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ త‌క్కువ స్థానాల్లో గెలుపొంద‌నుంద‌ని, అయితే, ఇత‌ర రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్ల‌ను కైవ‌సం చేసుకోవ‌డంతో ఆ లోటును భ‌ర్తీ చేస్తుంద‌ని అమెరికాకు చెందిన ఓ స‌ర్వే సంస్థ రిపోర్టు వెల్ల‌డించింది.

1 ) శ్రీకాకుళం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో..

# తెలుగుదేశం : 4
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌: 6
# జనసేన : 0
# ఇత‌రులు : 0

2 ) విజయనగరం జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లో..

# తెలుగుదేశం : 4
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌: 5
# జనసేన : 0
# ఇత‌రులు : 0

3 ) విశాఖపట్నం జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో..
# తెలుగుదేశం : 6
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 9
# జనసేన : 0
# ఇత‌రులు : 0

4 ) తూర్పుగోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో..
# తెలుగుదేశం : 6
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 11
# జనసేన : 02
# ఇత‌రులు : 0

5 ) పశ్చిమగోదావరి జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో..
# తెలుగుదేశం : 4
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 7
# జనసేన : 4
# ఇత‌రులు : 0

6 ) కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో..
# తెలుగుదేశం : 5
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 11
# జనసేన : 0
# ఇత‌రులు : 0

7 ) గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో..
# తెలుగుదేశం : 4
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 13
# జనసేన : 0
# ఇత‌రులు : 0

8 ) ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో..
# తెలుగుదేశం : 5
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 7
# జనసేన : 0
# ఇత‌రులు : 0

9 ) నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో
# తెలుగుదేశం : 3
# వైఎస్ఆర్ కాంగ్రెస్‌ : 7
# జనసేన : 0
# ఇత‌రులు : 0

10 ) కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో..
# తెలుగుదేశం : 3
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 11
# జనసేన : 0
# ఇత‌రులు : 0

11 ) కర్నూల్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో..
# తెలుగుదేశం : 6
# వైఎస్ఆర్ కాంగ్రెస్: 8
# జనసేన : 0
# ఇత‌రులు : 0

12 ) అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో..
# తెలుగుదేశం : 4
# వైఎస్ఆర్ కాంగ్రెస్: 10
# జనసేన : 0

13 ) 14 అసెంబ్లీ స్థానాలు ఉన్న చిత్తూరు జిల్లాలో..
# తెలుగుదేశం : 6
# వైఎస్ఆర్ కాంగ్రెస్ : 8
# జనసేన : 0
# ఇత‌రులు : 0

175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో..
తెలుగుదేశం : 66
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 103
జనసేన : 06
ఇత‌రులు : 0

అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్ల‌డించిన ఈ స‌ర్వే ఫ‌లితాల‌పై రాజ‌కీయ విశ్లేష‌కుల్లో విస్తృత స్థాయి చ‌ర్చ జ‌రుగుతోంది.