బ్యాడ్ టైమే నన్ను.. బ్యాట్ తో కొట్టింది.. అల్లు శిరీష్ !

0
316
america naa america song from ABCD

సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఏబీసీడీ’ లో అల్లు శిరీష్ కథానాయకుడిగా, అల్లు సరసన రుక్సార్ ధిల్లాన్ నటించగా మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రము మధుర ఎంటర్టైన్మెంట్, బిగబెన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతుంది. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ , ట్రైలర్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. లవ్ ఎంటర్టైన్మెంట్ గా కొనసాగే మూవీని మే 17న విడుదల చేయుటకు సన్నాహాలు జరుగుతుండగా.. చిత్ర ప్రమోషన్స్ వేగం పెంచారు చిత్ర బృందం. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అమెరికా .. నా అమెరికా..’ వీడియో లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు .

‘అమెరికా.. నా అమెరికా నిన్ను మిస్ ఔతున్నా బాగా.. స్లమ్ లో, ఈ దుమ్ములో నా ఫ్యూచర్ అర్ధం కాక.. బ్యాడ్ టైమే నన్ను.. బ్యాట్ తోనే కొడితే, డెస్టినీ ఎగిరెళ్ళి డస్ట్ బిన్ లో దూకిందే..’ అని కొనసాగే పాటలో శిరీష్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూడవచ్చు. అమెరికా నుంచి వచ్చిన అల్లు, ఇక్కడ పడుతున్న భాదలని.. అమెరికా లగ్జరీ లైఫ్ ని పోల్చుకుంటూ పాడుకునే పాటలో హీరో పాట్లు కనిపిస్తాయి. బెన్నీ దయాల్, సంజిత్ హెగ్డే ఆలపించిన ఈ పాట యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. మరి అల్లు ఏమేం చేస్తున్నాడో.. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మీరు వీక్షించండి.

అమెరికా నుంచి ఇండియా కి వచ్చిన కుర్రాడికి.. లైఫ్ అంటే ఏంటో తెలిసేలా ఉండే చిత్రమిది. జులాయిగా అమెరికా లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి.. ఇండియా వచ్చి కెరీర్ ను మలుచుకునేలా కథ ఉంటుందట.  అల్లు శిరీష్ తండ్రి గా నాగబాబు నటించగా కోట శ్రీనివాసరావు , శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రలు పోషించారు.

Read also:  

‘ఏబీసీడీ’ ట్రైలర్.. అల్లు హిట్ కొట్టేస్తాడేమో..!

‘అల్లు’తోనే నేనుంటా.. ఆకతాయి హీరోయిన్