అంబ‌టి రాయుడు సంచ‌ల‌న నిర్ణ‌యం.. ‘జెర్సీ’ స్టైల్లో..!

0
365

భార‌త్ బ్యాట్స్‌మెన్ అంబ‌టి రాయుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక‌పై తాను అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడ‌బోన‌ని స్ప‌ష్టం చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల‌కు తాను రిటైర్మెంట్ ప్ర‌క‌టించాన‌ని చెప్పాడు. అంబటి రాయుడు తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణ‌యానికిగ‌ల కార‌ణాల‌కు సంబంధించి ప‌లువురు స్పోర్ట్స్ ఎన‌లిస్టులు వారి వారి అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పుకొస్తున్నారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న క్రికెట్ ప్ర‌పంచ‌క‌ప్ – 2019కు భార‌త్ సెల‌క్ష‌న్ టీమ్ అంబ‌టి రాయుడుకు హ్యాండ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అంబ‌టి రాయుడు స్థానంలో విజ‌య్ శంక‌ర్‌ను సెల‌క్ట‌ర్‌లు ఎంపిక చేశారు. ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో విజ‌య్ శంక‌ర్‌కు గాయం కావ‌డంతో ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.

విజ‌య్ శంక‌ర్‌కు గాయం కావ‌డంతో ఇక అంబ‌టి రాయుడి ఎంట్రీ సుగుమ‌మేన‌ని అంద‌రూ భావించారు. కానీ, ఆ అవ‌కాశాన్ని కాస్తా మ‌యాంక్ అగ‌ర్వాల్ త‌న్నుకుపోయాడు. దీంతో అంబ‌టికి మ‌ళ్లీ నిరాశే ఎదురైంది. ఇలా త‌న‌ను సెలెక్ట‌ర్లు కావాల‌నే ప‌క్క‌నపెడుతున్నార‌ని భావించిన అంబ‌టి రాయుడు మ‌న‌స్తాపానికిగురై అంత‌ర్జాతీయ క్రికెట్ పార్మెట్‌కు గుడ్‌బై చెప్పాడ‌ని ఎన‌లిస్టుల అభిప్రాయం.

అంబ‌టి రాయుడి ఆవేశాన్ని, భావాల‌ను అర్ధంచేసుకున్న కొంద‌రు టాలీవుడ్ హీరో, నేచుర‌ల్ స్టార్ నానిని గుర్తు చేస్తున్నారు. నాని తాజాగా న‌టించిన జెర్సీ మూవీలోనూ ఇటువంటి స‌న్నివేశాలే ఉంటాయ‌ని, ఆ మూవీలో నాని ఎంత‌గొప్పగా ఆడినా భార‌త్‌జ‌ట్టుకు మాత్రం ఎంపిక కాలేక‌పోతాడ‌ని, సేమ్ టు సేమ్ సీన్ అంబ‌టి రాయుడి జీవితంలోను చోటు చేసుకుందంటూ రాయుడి ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో కామెంట్‌లు, ఫోటోల‌ను షేర్ చేస్తున్నారు.