ఏపీ స్పీక‌ర్‌గా అంబ‌టి.. క‌న్ఫామ్ చేసిన జ‌గ‌న్‌..!?

0
581

ఈ ద‌ఫా జ‌రిగినఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక మెజార్టీ ఎమ్మెల్యే స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కేబినేట్‌ను ఏర్పాటు చేసేందుకు క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం కేబినేట్ భేటీ జ‌ర‌గ‌డంతోపాటు అసెంబ్లీ స‌మావేశాలు కూడా జ‌ర‌గ‌నున్నాయి.

ఇదిలా ఉండ‌గా అసెంబ్లీ స్పీక‌ర్‌గా సీఎం జ‌గ‌న్ ఎవ‌రిని ఎంపిక చేయ‌నున్నారు..? అన్న అంశంపైనే ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ స్పీక‌ర్ రేసులో న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, బాప‌ట్ల ఎమ్మెల్యే కోనా ర‌ఘుప‌తి, ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. వారితోపాటు తాజాగా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు పేరు సైతం తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌త్య‌ర్ధుల‌పై ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రించాలో అంబ‌టి రాంబాబుకు వెన్న‌తోపెట్టిన విద్య అని, ఆ క్ర‌మంలో స్పీక‌ర్ ప‌ద‌విలో ఆయ‌న ఉంటే ఆ ప‌ద‌వికి వ‌న్నె వ‌స్తుంద‌ని వైసీపీకి చెందిన ప‌లువురు నేత‌లు అంటున్నారు.