కాళ్లు, చేతులు న‌రికేస్తామంటున్నారు.. హోంగార్డు ఫిర్యాదు..!

0
197

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కుటుంబ స‌భ్యులు త‌న‌ను బెదిరిస్తున్నారంటూ హోంగార్డు ర‌వికుమార్‌రెడ్డి ఈపురుపాలెం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆమంచి కృష్ణ‌మోహ‌న్ సోద‌రుడు, ఆమంచి స్వాములు కుమారుడు ఆమంచి రాజేంద్ర త‌న‌ను బెదిరిస్తున్నాడ‌ని ర‌వికుమార్‌రెడ్డి పేర్కొన్నాడు. ఈ మేర‌కు రాజేంద్ర త‌న‌ను బెదిరించే క్ర‌మంలో చేసిన ఫోన్‌కాల్‌కు సంబంధించి వాయిస్ రికార్డ్‌ను కూడా ర‌వికుమార్‌రెడ్డి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఆమంచి రాజేంద్ర త‌న‌కు ఫోన్ చేసి అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషిస్తూ త‌న‌ను నిత్యం వేధిస్తున్నాడ‌ని హోంగార్డ్‌ రాజేంద్ర ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఓ కేసులో రాజేంద్ర పేరు కూడా చెప్పాలంటూ వ‌త్తిడి తెచ్చాన‌ని ఆరోపిస్తున్నార‌ని, అస‌లు అటువంటి కేసుల్లో తాను త‌ల‌దూర్చ‌లేద‌ని ర‌వీంద్ర‌రెడ్డి చెబుతున్నాడు. అధికారంలో ఉన్న‌ది మా పార్టీనే.. కాళ్లు, చేతులు విరిచేస్తాం జాగ్ర‌త్త అంటూ బెదిరిస్తున్నార‌ని హోంగార్డ్ ర‌వీంద్ర‌రెడ్డి ఈపురుపాలెం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమంచి కుటుంబం నుంచి త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని పోలీసులకు లేఖ రాశాడు హోంగార్డ్ ర‌వికుమార్