ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ్‌ను బ‌హిష్క‌రించాలి.. ఆమంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

0
237

చీరాల టీడీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ్‌పై వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు. క‌ర‌ణం బ‌ల‌రామ్‌కు మ‌రో భార్య‌తోపాటు, ఆమెకు కుమార్తె కూడా ఉన్నారన్నారు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా అధికారుల‌కు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో ఈ విష‌యాన్ని పేర్కొన‌కుండా దాచార‌ని ఆరోపించారు. అయితే, ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఓట‌మిని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే.

విలువ‌ల గురించి అద్భుతంగా మాట్లాడే టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు బ‌ల‌రామ్ రెండో భార్య కుమార్తె తెలుస‌ని, ఆమె మంచి ర‌చ‌యిత‌ని, ఆమె రాసిన పుస్త‌కాన్ని చంద్ర‌బాబు ఆవిష్క‌రించార‌న్నారు. నామినేష‌న్ ప‌త్రాల్లో ఆమెను త‌న కుమార్తెగా ఎందుకు పొందుప‌ర‌చ‌లేదో క‌ర‌ణం బ‌ల‌రామ్‌ను ప్ర‌శ్నించాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుకు లేదా..? అని ఆమంచి కృష్ణ‌మోహ‌న్ అన్నారు.