అక్కినేని అమల కున్న శక్తులివే..! ‘హై ప్రీస్టెస్’

0
143
amala palyed main role in high priestess

ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘హై ప్రీస్టెస్’ . సీనియర్ నటి సోషల్ కార్యకర్త అక్కినేని అమల తొలిసారిగా వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అక్కినేని ప్రదాన పాత్ర పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో అక్కినేని అమల తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్,సునయన , కిషోర్ , బ్రహ్మాజీ , విజయలక్ష్మీ, ఆదవ్ కన్నదాసన్, బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయి, భవాని నటిస్తున్నారు. ఈ సిరీస్ ను తెలుగుతో పాటు మరో ఏడు భాషలలో తెరకెక్కిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సీరీస్ జీ5 స్ట్రీమింగ్ లో ఏప్రిల్ 25వ తేదీన ప్రసారం చేస్తున్నారు.  తాజాగా సిరీస్ ట్రైలర్ విడుదల చేశారు.

ఈ సిరీస్ లో అమల స్వాతి పాత్రలో నటిస్తుంది. తాను అతీంద్రియ శక్తులను కలిసి ఉంటుంది. ఆమె చుట్టున్న కొన్ని శక్తులను ఆమె గ్రహించగలదు. అమల టారో కార్డు రీడర్ గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా కొన్ని విచిత్రమైన కేసులను పరిష్కరిస్తూ .. ప్రధాన పాత్ర పోషిస్తుంది.

దర్శకుడు – పుష్ప ఇగ్నాటిస్
నిర్మాత – కృష్ణకుమార్ కులశేఖరన్
సంగీత దర్శకుడు – గోపాల్ రావు పర్నాండి
ఎడిటర్ – రిచార్డ్ ఎ. కెవిన్
కాస్ట్యూమ్ డిజైనర్ – అనూ వర్ధన్