20 రోజ‌ల పాటు న‌గ్నంగా షూటింగ్

0
737

ద‌మ్మున్న న‌టి అమ‌లాపాల్. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్ గా న‌టించేందుకైనా వెనుకాడ‌ని ధీశాలి. తాజాగా ఆమె న‌టిస్తోన్న మూవీ ‘ఆడై’. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ నుంచి మొన్న‌టి టీజ‌ర్ వ‌ర‌కూ ఒక సంచ‌ల‌నంగా మారుతోంది. మేయాదమాన్‌ వంటి సక్సెస్‌ఫుల్ మూవీ ద్వారా పరిచయం అయిన రతన్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం ఆడై.

దుస్తులు లేకుండా ఒంటికి టాయిలెట్‌ పేపర్‌ చుట్టుకున్న అమలాపాల్‌ ఫొటోగా వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ సంచ‌ల‌నంగా మారగా, ఇటీవల విడుదల చేసిన ఆడై టీజర్లో అమలాపాల్‌ పూర్తి నగ్నంగా కూర్చుని ఏడుస్తున్న దృశ్యం ఆవిష్క‌రించారు. ఈ మూవీలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగా ఉండ‌టంతో ఆ సన్నివేశాల షూట్‌ కోసం అమలాపాల్‌ 20 రోజులు దుస్తుల్లేకుండా నటించిందట.