ఇంట్లోనే అలోవెరా తో మీ అందాన్ని రెట్టింపు చేయవచ్చు

0
417
Aloe vera can get a whiteness from the house
You can double your beauty with Aloe vera at home

నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మార్చడం ఎలాగో తెలుసుకుందాం. నల్లగా వున్నా చర్మాన్ని తెల్లగా మార్చడం లో కలబంద గుజ్జు ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో వుండే విటమిన్ సి చర్మం లో వున్నా డెడ్ సెల్స్నితొలగించి చర్మాన్ని తెల్లగా మారుస్తుంది. మీ దగ్గర కలబంద గుజ్జు లేకపోతె మనకి మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం చర్మం తెల్లపడటానికి కొన్ని అలోవెరా పేస్ పాక్స్ని ట్రై చేస్తాం.
మొదటి టిప్ :

దీనికి కావాల్సిన పదార్దాలు :
• అలోవెరా జెల్
• రోజ్ వాటర్
తయారీ విధానం :

ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ రోజ్ వాటర్ ని యాడ్ చేస్కోండి. తరువాత కొద్దిగా అలోవెరా జెల్ ని యాడ్ చేస్కోండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇపుడు ఇది మీ పేస్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలదాకా అలాగే వుండండి .బాగా ఆరిపోయిన తరువాత దీనిని శుభ్రం చేసుకోండి. చల్లని నీటితో. ఇలా మీరు క్రమం తప్పకుండ చేయడం వలన మీ ముఖం పైనవున్నటివంటి మచ్చలు అలాగే స్కిన్ టాన్ వున్నటువంటిది అంత తొలగిపోతుంది. ముఖం తెల్లగా మారుతుంది.

రెండవ టిప్ :
దీనికి కావాల్సిన పదార్తాలు :
• పసుపు
• తేన
• అలోవెరా జెల్

తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం,కొద్దిగా తేనే,కొద్దిగా అలోవెరా జెల్. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ముఖానికి ఒక మాస్క్ లాగా అప్లై చేసుకొని15 నిమిషాల పటు ఆరనివ్వాలి. బాగా డ్రై ఐన తరువాత చల్లని నీటితో మొఖాన్ని కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేయడం వలన ముఖం పైన ఉన్నటువంటి మొటిమలు వాటి తాలుకు మచ్చలు తొలగిపోయి మొకం ప్రకాశవంతంగా ఉంటుంది.

మూడవ టిప్ :
దీనికి కావాల్సిన పదార్దాలు :
అలోవెరా జెల్
అలోవెరా జెల్ ని రాత్రి పడుకునే ముందు ఈ గుజ్జుని మొఖానికి అప్లై చేసుకొని పడుకోండి. పొద్దున్న లేచి
కడిగేయండి. ఇలా చేయడం వలన నల్లగా వున్న చర్మం తెల్లగా మారుతుంది.

నాలుగోవ టిప్ :
దీనికి కావాల్సిన పదార్ధాలు
నిమ్మరసం
అలోవెరా జెల్

తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా నిమ్మరసం, అలోవెరాజెల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొఖానికి మెడకి అప్లై చేయండి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇలా చేయడం మీ చర్మం పైన వున్న టాన్ ని తొలగించి. స్కిన్ కాంతివంతంగా మెరుస్తుంది.

ఐదవ టిప్:
దీనికి కావాల్సిన పదార్దాలు :
కీరదోసకాయ పేస్ట్
అలోవెరా జెల్

తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కీరదోసకాయ పేస్ట్ వేసుకోవాలి తరువాత అలోవెరా జెల్ వేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల నుండి 20 నిముషాలు వరకు డ్రై అవ్వనివండి. ఆ తరువాత చల్లని నీటితో ముఖం వాష్ చేస్కోండి. ఇలా రెగ్యులర్ గ చేయడం వలన ముఖం పైన ఉన్నటువంటి మచ్చలు ,టాన్ అన్నితొలగిపోయే ముఖం చాల కాంతివంతంగా కనిపిస్తుంది