బన్నీ, త్రివిక్రమ్ ల సినిమా ‘అలకనంద’ టైటిల్ ఖరారు..! టబు తల్లి పాత్రలో

0
148
tabu acting with alluarjun in alakanandha movie

స్టైలిష్ స్టార్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఈ మధ్యే పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాను తండ్రి కొడుకుల అనుబంధ నేపథ్యంగా తెరకెక్కించాలనుకున్నారట. ముందుగా సినిమా టైటిల్ ను ‘నాన్న- నేను’ గా ఖరారు కూడా చేసుకున్నారట. కానీ ఇప్పటికే తండ్రి, కొడుకుల అనుబంధ పరంగా తెరకెక్కిన సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఉండటం వలన.. కొంతవరకు కథను కూడా మార్చి తల్లి కొడుకుల అనుబంధ నేపథ్యంలో కథను మార్చరట.

తల్లి పాత్రకు ‘టబు’తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక తల్లి పాత్రతో ఉన్న టైటిల్ ను తెరకెక్కించే దిశగా ‘అలకనంద’ అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ ను అల్లుఅర్జున్ కి, త్రివిక్రమ్ చెవిలో వేసేశాడట. ఇక బన్నీ ఏమంటాడో .. ఆయన ఓకే చెప్తే టైటిల్ ఖరారు అయినట్లేనని వార్తలు వెల్లువడుతున్నాయి. పూజ హెగ్డే అల్లు సరసన రెండోసారి నటిస్తుంది. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.