‘బన్నీ’ బర్త్ డే కి అభిమానులకు గొప్ప అవకాశము..!

0
246
allu arjun
allu arjun

అల్లుఅర్జున్ ఈరోజు 36వ పుట్టిన రోజు సంబరంలోఉన్నాడు. అల్లుఅర్జున్ డాన్స్ అంటే పిచ్చెక్కి పోయే అభిమానులున్నారు. ఎంతో స్టైలిష్ గా, నటనతో అభిమానుల మనసు దోచుకునే హీరో డాన్స్ అంటే మెగా పవర్ స్టార్ కి చాలా ఇష్టమట. చిన్నపుడు ఇద్దరు తెగ పోటీ పడుతూ డాన్స్ చేసేవారు. ఎన్నో సార్లు చరణ్ కు ఇంటర్వ్యూలలో మీకు ఎవరి డాన్స్ ఇష్టమని ప్రశ్న తలెత్తగా.. టక్కున బన్నీ అనే చెప్పాడు. ఇక అల్లుఅర్జున్ తన బర్త్డే సందర్బంగా అభిమానులకు ఒక గొప్ప అవకాశాన్నిచ్చాడు. ఎవరైనా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే ఒక మొక్కను ఇవ్వమన్నారు. ఫాన్స్ గుర్తుగా ఆ మొక్కను బన్నీ ఫామ్ హౌస్ లో నాటుకుంటానని చెప్పాడు.

allu arjun
allu arjun birthday celebrations with him family

అల్లుఅర్జున్ సినీ రంగంలోకి బాల నటుడిగా విజేత , స్వాతి ముత్యం వంటి సినిమాల్లో నటించాడు. ఆ తరువాత మెగా స్టార్ చిరు నటించిన ‘డాడీ’ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు. ఇక హీరోగా స్టైలిష్ స్టార్ జర్నీ 2003లో గంగోత్రి తో మొదలైంది. ఆ తర్వాత వరుసగా ఆర్య, బన్నీ, హ్యాపీ , దేశముదురు , పరుగు , ఆర్య 2, వరుడు , వేదం , బద్రీనాథ్ , జులాయి , ఇద్దరు అమ్మాయిలతో , రేసుగుర్రం, ఎవడు , సన్ అఫ్ సత్యమూర్తి , రుద్రమ దేవి, సరైనోడు, డీజే , నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా  ఒక్క సంవత్సరం గ్యాప్ లేకుండా దాదాపుగా 19 సినిమాలలో నటించాడు. ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి లోను .. ఓ పాత్ర పోషిస్తున్నాడు.

బన్నీ బర్త్డే కానుకగా అభిమానులకు ఓ విషయాన్ని అందించారు. బన్నీ 20వ చిత్రంగా దిల్ రాజు, అల్లు కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించబోతున్న చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు.

Alluarjun acting into Icon MOvie