జనసేన కు మద్దతుగా పాలకొల్లు ప్రచారంలోకి దిగిన అల్లువారబ్బాయి..!

0
222
alluarjun in palkollu meeting

పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ మద్దతు రోజురోజుకు పెరుగుతుంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ మెగా ఫ్యామిలీ కాలు అడుగులు జనసేన వైపుగా సాగుతున్నాయి. నాగబాబు, వరుణ్ ,నిహారిక ఒక్కొక్కరిగా జనసేన కు చేరువయ్యారు. నిన్న మెగా పవర్ స్టార్ బాబాయి ని పలకరించారు. తాజాగా అల్లు వారబ్బాయి మెగా హీరోకి మద్దుతునిస్తూ ఈరోజు పాలకొల్లులో ప్రచారంలో పాల్గొన్నారు. మరో పక్క జబర్దస్థ్ టీమ్ కరపత్రాలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.

bunny with pawankalyan in palakollu meeting

జన సేన పార్టీ కి నిన్నమొన్నటివరకు ట్విట్టర్ ద్వారా వారి సపోర్ట్ అందచేసిన అల్లువారబ్బాయి. ఇప్పుడు డైరెక్ట్ గా పవన్కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలోకి దిగడంతో మెగా ఫాన్స్ ఆనందిస్తున్నారు. అల్లుఅర్జున్ నిన్న బర్త్డే సెలెబ్రేట్ చేసుకొని ఈరోజు , మామయ్యను కలవడానికి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు చేరుకున్నాడు. బన్నీ బాబు సొంత ఊరైన పాలకొల్లులో జనసేన ప్రచారంలో పాల్గొన్నాడు. అల్లు అర్జున్ రాకతో పవన్ చాలా ఆనందించాడు. ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అందరికి అభివాదం చేసారు. అల్లు అర్జున్ జనసైనికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపారు. ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ఐదుగంటలకు ముగుస్తుంది.