బ‌న్నీ మంచి మ‌న‌సు

0
145

మండే ఎండ‌ల‌కు ఒక్క నిమిషంపాటు ఆరు బ‌య‌ట‌ ఉండాలంటేనే భ‌యం పుడుతోంది. అలాంటిది ట్రాఫిక్ పోలీసుల ప‌రిస్థితేంటి? అదే అనుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అనుకున్న‌దే త‌డ‌వుగా నాణ్యమైన మజ్జిగను తయారు చేయించి.. ప్రతిరోజూ 300 బాటిళ్ల చొప్పున మజ్జిగను పోలీసులకు అందిస్తున్నారు.

వేసవి కాలం పూర్తి అయ్యే వరకు ఈ మజ్జిగ బాటిళ్ల పంపిణీ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌ నగర్, సైఫాబాద్‌ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఈ మజ్జిగ బాటిళ్లను అందజేస్తున్నారు.