వైఎస్ భార‌తి ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చింద‌ట‌.. అఖిల‌ప్రియ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది..!

0
5157

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌ల్లి వైఎస్ విజ‌య‌మ్మ‌కు మాజీ మంత్రి అఖిల ప్రియ ఫోన్ చేశారు.. ట‌చ్‌లో ఉన్నారు.. వైసీపీలోకి వ‌స్తానంటే జ‌గ‌న్ వ‌ద్ద‌న్నారు.. అందుకు ఎస్‌వీ మోహ‌న్‌రెడ్డి అడ్డుప‌డ్డాడు.. కానీ అఖిల‌ప్రియ చూపు వైసీపీవైపు అంటూ ఇటీవ‌లి సార్వత్రిక ఎన్నిక‌ల‌కు ముందు.. ఎన్నిక‌ల త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా చ‌ర్చ జ‌రిగిన విషయం విధిత‌మే.

ఇదే విష‌య‌మై అఖిల‌ప్రియ‌ను ప్ర‌శ్నించ‌గా, తాను ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యేగా ఓడిన త‌రువాత టీడీపీలో ఉండ‌టం వృథా.. వైసీపీలోకి వెళ్లాల‌న్న ఉద్దేశంతో వైఎస్ విజ‌య‌మ్మ‌తో మాట్లాడినాన‌ట‌.. విజ‌య‌మ్మ‌తో మాట్లాడిన త‌రువాత ఆమె ఇంటికి ర‌మ్మ‌నింద‌ట‌.. నేను విజ‌య‌మ్మ ఇంటికి వెళ్లాన‌ట‌.. ఆమె కాఫీ ఇచ్చింద‌ట‌.. భార‌త‌క్క కాఫీ ఇచ్చింద‌ట‌.. వాళ్లంద‌రితో మాట్లాడానంట‌.. అంటూ కామాలు పెడుతూ సోష‌ల్ మీడియాలో ఎవ‌రికి వారు ఇష్ట‌మొచ్చిన‌ట్టు క‌థ‌నాలు ప్ర‌చురించార‌ని, ఆ క‌థ‌నాల‌కు త‌న‌కు ఎటువంటి సంబంధం లేద‌ని అఖిల‌ప్రియ చెప్పుకొచ్చింది. తాను మాత్రం ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచే ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా బ‌రిలో ఉంటాన‌ని ఆమె క‌రాఖండిగా చెప్ప‌డం గ‌మ‌నార్హం.