చంద్రబాబు నాయుడు ఏం చేసిన లోకేశ్ గెలవలేడు ఎందుకంటే..? : ఆర్కే

0
128
చంద్రబాబు నాయుడు ఏం చేసిన లోకేశ్ గెలవలేడు ఎందుకంటే..? : ఆర్కే
చంద్రబాబు నాయుడు ఏం చేసిన లోకేశ్ గెలవలేడు ఎందుకంటే..? : ఆర్కే

చంద్రబాబు నాయుడు తన పుత్రుడు “నారా లోకేశ్” ను గెలిపించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎంత డబ్బు పంచిన లోకేశ్ మాత్రం గెలవలేడని.. ఓటమి ఖాయమని మంగళగిరి YCP అభ్యర్థి “ఆళ్ల రామకృష్ణారెడ్డి” చెప్పారు. మంగళగిరిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో YCP గెలుస్తుందని.. మంగళగిరిలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

అక్కడితో ఆగని ఆర్కే “మీ అబ్బాయి 9వ తారీఖున జరిగే ఎన్నికల్లో గెలవలేడు. నువ్వు (చంద్రబాబు) ఎన్ని చేసినా మీ అబ్బాయి మంగళగిరిలో గెలవలేడు. 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో వైసీపీ గెలిచి తీరుతుంది. అయినా లోకేశ్ కు మంగళగిరి అని పలకడమే రాదు. మంగళగిరి నైసర్గిక స్వరూపం తెలియదు.. పైగా నామినేషన్ వేయడం రాదు… మరీ ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ డేట్ కూడా తెలియదు. అలాంటి వ్యక్తిని మంగళగిరి ప్రజలు ఎలా ఎన్నుకుంటారు ? అంటూ లోకేశ్ పై విమర్శలు చేశారు ఆర్కే.