అఖిల‌ప్రియ : రాక్ష‌సి అంటారా..? కాళ్లు ఇర‌గ్గొడ‌తారు జాగ్ర‌త్త‌..!

0
340

వైసీపీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డిపై మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కాగా, ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇరిగెల రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి మీతి చెంద‌డంతో తాము చాలా సంతోష‌ప‌డ్డామని, శోభ‌మ్మ మ‌ర్డ‌ర్స్ ప్లానింగ్స్‌లో ఇన్వాల్వ్ అయి ప్లానింగ్స్ చేసేది.. ఆమె ఒక రాక్ష‌సి అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇదే విష‌య‌మై అఖిల‌ప్రియ రియాక్ట్ అయ్యారు.

త‌మ ప్ర‌త్య‌ర్ధులు భూమా ఫ్యామిలీపై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేయ‌డం స‌హ‌జ‌మేనని, కానీ ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆ ప‌రిధిల‌ను దాటి మ‌రీ మాట్లాడార‌ని అఖిల ప్రియ అన్నారు. ఇంట‌ర్వ్యూలో మా అమ్మ‌ను రాక్ష‌సి అంటాడా..! అదే మాట సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముందు అంటే రాంపుల్లారెడ్డిని నాలుగుపీక ప‌క్క‌న కూర్చోబెట్టేవాడు అంటూ అఖిల‌ప్రియ చెప్పుకొచ్చింది.

నిజంగానే శోభ‌మ్మ కానీ, నాగిరెడ్డి కానీ ఇరిగెల రాంపుల్లారెడ్డిమీద ప్లానింగ్ చేసి.. స్కెచ్ వేసి ఉంటే బ‌తికి బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం లేదు. అలా భూమా నాగిరెడ్డి ప్లానింగ్ చేయ‌కుండా శోభ‌మ్మ వేరే డైరెక్ష‌న్‌లోకి తీసుకెళ్లింది కాబ‌ట్టే వీరంతా బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డార‌ని అఖిల‌ప్రియ తెలిపింది. ప్ర‌స్తుతం నాగిరెడ్డి, శోభ‌మ్మ ఇద్ద‌రూ లేరు క‌నుక ప్ర‌త్య‌ర్ధులు ఎంత‌కైనా మాట్లాడ‌తారు. ఇంకోసారి ఎవ‌రైనా రాక్ష‌సి అంటూ శోభ‌మ్మ‌ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేస్తే మాత్రం ఊరుకునే ప్ర‌స‌క్తే లేదంటూ అఖిల‌ప్రియ తీవ్ర కంఠ‌స్వ‌రంతో హెచ్చ‌రించారు.