RRR సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర ఇదే ..!

0
232
Ajay Devgan
Ajay Devgan acting in RRR movie

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించబోతున్న’ఆర్ఆర్ఆర్’ చిత్రం గూర్చి ఈ మధ్యే ప్రెస్ మీట్ పెట్టి పాత్రలు, పాత్రధారులు, కథ సారాంశం లను తెలుపుతూ వివరనిచ్చారు. ఆరోజు నుంచి ప్రతి ఒక్కరు సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. 1920 బ్యాక్ డ్రాప్‌లో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లాంటి గొప్ప వారి జీవితాల కథను తీసుకొని, దానికి కొంత కాల్పనిక కథను కలిపి RRR చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నాడు.

కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ను, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. రామ్ చరణ్ పక్కన అలియా భట్ , జూనియర్ ఎన్టీఆర్ జోడిగా డైసీ ఎడ్గార్ బర్గ్ నటిస్తుంది. చిత్ర రెండోభాగంలో అజయ్ దేవగణ్ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారని అతని పాత్ర చాలా పవర్ఫుల్ గ ఉంటుందని అన్నారు రాజమౌళి.

రాజమౌళి రూపుదిద్దిన ‘ఈగ’ హిందీ డబ్బింగ్ కు వాయిస్ ఓవర్ ఇచ్చాడు అజయ్ దేవ్‌గణ్ . ఆరోజు నుండి వీరిద్దరి మధ్య స్నేహం కలిగిందట. అందుకే వెంటనే RRR సినిమాలో ముఖ్యపాత్ర చేయడానికి దేవగణ్ ఒప్పుకున్నాడని వార్తలు. అంతే కాకుండా 2002 సంవత్సరంలో అజయ్ దేవగణ్ నటించిన ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో ఇతని యాక్షన్ చూశాక రాజమౌళి ట్రిపుల్ఆర్ లో కూడా భగత్ సింగ్ లక్షణాలు కలిగిన విప్లవకారుని పాత్రను ఇవ్వబోతున్నాడని  ఫిల్మ్ ఇండస్ట్రీ లో కథనాలు వినబడుతున్నాయి.

బహుబలి చిత్రంలో బహుబలి పాత్రతో పాటు శివగామి, భల్లాలదేవ పాత్రలు కూడా ప్రధానమైనవి.  వారందరి తర్వాత అంతే పవర్ఫుల్ పాత్ర కట్టప్పది. బహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అంటూ బాహుబలి 2 మీద ఆసక్తిని రేపి, ప్రేక్షకులను ఎదురుచూసేలా చేశాడు. ఈ పరంగానే ఆర్ఆర్ఆర్లో అజయ్ దేవగణ్ పాత్రను సృష్టించాడని అందరు అనుకుంటున్నారు. మరో వైపు సముద్రఖని పాత్రా కూడా ఎంతో ప్రధానమైనదని తేల్చిచెప్పాడు. భారత సినీ పరిశ్రమలోనే మరో చరిత్రను లిఖించి , రికార్డు సృష్టించబోతున్నాడని మాత్రం అర్ధమవుతుంది. అజయ్ దేవగణ్, సముద్రఖని లకు ఇచ్చే పాత్రలు ఏమై ఉంటాయని అందరిని ప్రశ్నార్థకంలో పడవేశాడు రాజమౌళి.

 Read also :