మ‌ళ్లీ వైసీపీ గూటికి ఆ ఎంపీ.. జ‌గ‌న్ రానిస్తాడా..?

0
190

క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక నేడు కాంగ్రెస్ గూటికి చేర‌బోతున్నారు. కాగా, 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై క‌ర్నూలు ఎంపీగా గెలుపొందిన బుట్టా రేణుక ఆ త‌రువాత చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌మక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా, మ‌రొకొన్ని రోజుల్లో ఏపీలో అసెంబ్లీతోపాటు, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బుట్టా రేణుక వైసీపీ కండువా క‌ప్పుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే, ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న ఆమెకు ఆ పార్టీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌ర్నూలు ఎంపీ టికెట్‌పై ఎటువంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేద‌ని, పైగా త‌న‌ను ఆదోని నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని టీడీపీ సూచించిందని, అక్క‌డ గెలుపు అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో రేణుక నిరాక‌రించింద‌ని ఆమె అనుచ‌రులు చెబుతున్నారు.

అంతేకాక‌, బుట్టా రేణుక‌ను టీడీపీ త‌రుపున రాజ్య‌స‌భ‌కు పంపుతామ‌ని సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చినా అందుకు ఆమె నిరాక‌రించిన‌ట్టు స‌మాచారం. ఫైన‌ల్‌గా పార్టీ మార్పు విష‌య‌మై కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ని, వారు కూడా అందుకు అంగీక‌రించ‌డంతో ఈ రోజు సాయంత్రం ఇడుపుల‌పాయ వేదిక‌గా బుట్టా రేణుక జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేర‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి.