మళ్లీ పెళ్లాడతా..!

0
42

రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో పెళ్లికి రెడీ అయ్యాడు. వివాహం చేసుకుంటున్న విషయాన్ని పుతిన్ స్వయంగా మీడియాకు తెలియజేశాడు. వ్యక్తిగత, కుటుంబపరమైన విషయాల్లో గోప్యతను పాటించే పుతిన్ స్వయంగా పెళ్లి కబురు చెప్పడం హాట్టాపిక్ అయింది.

66 ఏళ్ల పుతిన్ గతంలో యూడ్మిలాన్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే, 2013లో వారి వివాహ బంధం తెగిపోయింది. వీరిద్దరికి పుట్టిన ఇద్దరు కూతుళ్లు రహస్యంగా జీవిస్తున్నారు. వారి వయస్సే మూడు పదులు ఉంటుంది. అలాంటి పిల్లల తండ్రి పుతిన్ మళ్లీ మనువాడుతున్నాడు.

ఒలంపిక్స్ మాజీ జిమ్నాస్టర్ అలీనా కబేబాతో పుతిన్ సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయనే పెళ్లి ప్రస్తావన తేవడం చూస్తుంటే పుతిన్ భార్య కాబోయేది అలీనాయే అనే వార్తలు జోరందుకున్నాయి.