2019 ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ .. హీరోయిన్ ప్రణీత ..!

0
255
actress praneetha

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన అమ్మడు ప్రణీత. చిన్న చిరునవ్వుతో ఎంతో అందంగా ఆకర్శించే అందం ఆమె సొంతం. ఈ ముద్దుగుమ్మ భావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం లాంటి సినిమాల్లో నటించి అమాయకత్వమైన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటిస్తోంది. ఈ మధ్యే విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు లో కూడా పాత్ర ను పోషించింది.

ప్రణీత సుభాష్ ఎన్నికల మీద ప్రజలందరికి అవగాహనా కల్పించే బ్రాండ్ అంబాసిడర్‌గా సెలెక్ట్ అయ్యింది. గొప్ప అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంది ముద్దుగుమ్మ. ఇంతటి విషయాన్ని ప్రణీతనే స్వయంగా సామజిక మాధ్యమం ద్వారా వెల్లడించింది.

ప్రణీత సుభాష్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ‘కర్ణాటక స్టేట్ ఐకాన్‌ గా ప్రణీత సుభాష్ ను ఎంపిక చేసినట్లు, ఈసీ అందించిన లెటర్’  ను పోస్ట్ చేసింది. 2019 సంవత్సరంకి గాను లోక్‌సభ ఎన్నికల మీద ప్రజలకు సరైన అవగాహనను తెలియపరుచుటకు ప్రణీత రంగంలోకి దిగుతుంది. కర్ణాటకలో మొత్తంగా 28 లోక్‌సభ నియోజకవర్గాలు కలవు. ప్రజలు తమ ఓటును ఎలా వినియోగించుకోవాలి? ఓటు కున్న ప్రాధాన్యత ఏంటి? అనే విషయాలపై ప్రజలను చైతన్య పరచడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది.

actress praneetha
praneetha state icons for loksabha elections 209