న‌టి ప్ర‌గ‌తి వాడేసోపు ప్లాంత‌ర ప‌గిడి..!

0
662

అంద‌రి అందం కాలంతోపాటుగా క‌రిగి పోతుంది క‌దా..! మ‌రి నీ అందం మాత్రం అలానే ఉంటుంది, నీవేమ‌న్నా కాలాన్ని క‌న్వెన్స్ చేసేస్తావా..? నీ అందం ఇప్ప‌టికీ మెరుస్తుండ‌టానికి టిప్స్ ఏమ‌న్నా ఉన్నాయా..? పొద్దు పొద్దున్నే ఏమైనా క‌లుపుకుని తాగ‌డం, మ‌ధ్యాహ్నం ప్ర‌త్యేకించి ఏమ‌న్నా తిన‌డం, రాత్రి ఏమైనా వాడ‌టం వంటివి ఏమైనా టిప్స్ ఉన్నాయా.?? అంటూ యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు న‌టి ప్ర‌గ‌తి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు.

ఇంట‌ర్వ్యూలో భాగంగా న‌టి ప్ర‌గ‌తి మాట్లాడుతూ పొద్దు పొద్దున్నే నేనేమీ బ‌ల‌వంతంగా లేవ‌ను. ప్ర‌శాంతంగా, న‌వ్వుతూ, చిరున‌వ్వుతో నిద్ర లేస్తాను. ఆ ముందు రోజు ఎంత ద‌రిద్రంగా గడిచిన‌ప్ప‌టికీ మ‌రుస‌టి రోజు ఉద‌యం మాత్రం మ‌ళ్లీ కొత్త జీవితాన్ని న‌వ్వుతో, ప్ర‌శాంత‌తో మొద‌లు పెడ‌తానంటూ న‌టి ప్ర‌గ‌తి స‌మాధానం ఇచ్చింది.

అంతేకాకుండా, అస‌లు అందం అంటే పైపైన క‌న‌ప‌డేది కాదు. లోన మ‌న‌సు ఎంత స్వ‌చ్ఛంగా, ఎంత ప్ర‌శాంతంగా ఉంటే బ‌య‌ట‌కు అంత అందంగా క‌నిపిస్తారు. ఆ రెండు ఉంటే ఎవ్వ‌రైనా అందంగా క‌నిపిస్తారంటూ న‌టి ప్ర‌గ‌తి చెప్పుకొచ్చింది.

సినిమాల్లో హీరో మ‌ద‌ర్ క్యారెక్ట‌ర్‌ను కూడా అలానే ఛేంజ్ చేసేశా. గ‌తంలోలా ఇప్పుడు హీరోల మ‌ద‌ర్‌లు తెల్ల వెంట్రుక‌ల‌తో, డిప్రెష‌న్‌లో డ‌ల్‌గా ఎందుకుండాలండి..? అంటూ ఎదురు ప్ర‌శ్నించింది. ఆ క్యారెక్ట‌ర్‌లో ఛేంజ్ తీసుకొచ్చాన‌ని, ప్ర‌స్తుతం వెండితెర‌మీద ప్ర‌ద‌ర్శింప‌బ‌డే సినిమాల్లో హీరోల మ‌ద‌ర్‌లు యంగ్ అండ్ డైన‌మిక్‌గానే క‌నిపిస్తున్నార‌ని చెప్పింది న‌టి ప్ర‌గ‌తి. అలాగే, త‌న‌కు 20 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల పాప ఉన్నార‌ని చెప్పింది.

ఇంత‌కీ న‌టిని ప్ర‌గ‌తిని ఇంట‌ర్వ్యూ చేసింది ఎవ‌రో కాదు. టాలీవుడ్‌లో హాస్య లెజెండ్‌గా గుర్తింపు పొందిన అలీనే. ఇంట‌ర్వ్యూలో భాగంగా అలీ మాట్లాడుతూ ఈమె సంతూర్ మ‌మ్మీ కాదు.. ఈమె వాడే సోపు పేరు ఏమ‌న్నా పెట్టాలీ అని సంకోచిస్తూనే ఫ్లాంత‌ర ప‌గిడి అంటూ కామెంట్ చేశాడు. ఇక అప్ప‌ట్నుంచి న‌టి ప్ర‌గ‌తి వాడే సోపు ఫ్లాంత‌ర ప‌గిడి అంటూ సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి.