బాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడి కన్నుమూత ..!

0
225
navatej hundal with his family

ఈ సంవత్సరములో విడుదలైన సినిమాలలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నా చిత్రం ‘యూరి ది సర్జికల్ స్ట్రైక్’. ఈ సినిమా 240 కోట్లను కైవసం చేసుకుంది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా నటించగా, నవ్‌తేజ్ హుందాల్ ఓ ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు అంటూ అభిమానులు కొనియాడారు. అంతే కాకుండా ఇలాంటి మరిన్ని సినిమాలు కావాలంటూ ప్రేక్షకులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో నటించిన నవ్‌తేజ్ హుందాల్ నిన్న సాయంత్రం ముంబైలో తన సొంత ఇంటిలో కన్నుమూశారు. ఈ వార్త వినగానే ఇండస్ట్రీ వారంతా దిగ్బ్రాంతి కి గురయ్యారు. నవ్‌తేజ్‌ భార్య నీలం సందు హుందాల్ . వీరికి ఇద్దరు కూతుళ్లున్నారు. నవ్‌తేజ్ హుందాల్ బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా , ఎంతో ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలలో ఖల్ నాయక్, తేరే మేరే సప్నే లాంటి కొన్ని సినిమాలకు యాక్టింగ్ క్లాసులు కూడా నిర్వర్తించాడు. అంతేకాకుండా బుల్లి తెరమీద ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎందరినో ఆకట్టుకున్నాడు.

‘యూరి ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రం లో నవ్‌తేజ్‌ హుందాల్‌ ‘హోమ్ మినిస్టర్‌’ పాత్రను పోషించాడు. ఈ చిత్రం లో ఈ పాత్ర బాగా హైలెట్ గా నిలచింది నవ్‌తేజ్‌ మరణంపై సినీ, టివి ఆర్టిస్టు అసోసియేషన్‌, బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు.