ట్రెండింగ్ .. ‘మే 23న తీరం దాటబోటోన్న జనసేన శతఘ్ని తుఫాను’ – యాక్ట్రర్ ధనరాజ్

0
134

మే 23వ తేదీన వెలువడబోయే ఎన్నికల ఫలితాల పై సెటైరికల్ గా స్పంధించారు ‘జబర్దస్త్’ నటుడు ధన్‌రాజ్. జనసేన ప్రభంజనం రాబోతోందంటూ పరోక్షంగా చెప్పిన ఆయన.. ఈ తుఫాను దెబ్బకి కొన్ని  పార్టీలు గల్లంతవుతాయనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు.

‘బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 23న తుఫానుగా మారి, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి మీదుగా కుప్పంలో తీరం దాటనుంది. గంటకు 120-145 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ గాల్లో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఏ సంబంధం లేదు. ప్రమాద హెచ్చరిక ముందుగానే జారీ చేశాం. తుఫానుకి “జనసేన శతఘ్ని” అని నామకరణం చేశారు’

అని ధన్‌రాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ గా మారింది.