ఫైర్ ఏ మాత్రం త‌గ్గ‌ని అచ్చెన్నాయుడు..!

0
182

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రెండో శాస‌న స‌భ‌కు స్పీక‌ర్‌గా ఎన్నికైనందుకు టీడీపీ త‌రుపున‌, శ్రీ‌కాకుళం జిల్లా ప్ర‌జ‌లంద‌రి త‌రుపున త‌న మ‌న‌స్ఫూర్తి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్టు మాజీ మంత్రి, టెక్క‌లి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స‌భాప‌తి త‌మ్మినేని సీతారాం ఉద్దేశించి అన్నారు. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజులో భాగంగా అచ్చెన్నాయుడు స‌భ‌ను ఉద్దేశించి మాట్లాడారు.

కాగా, త‌మ్మినేని సీతారాంను స‌భాస‌తి చైర్‌లో కూర్చోబెట్ట‌డంపై త‌లెత్తిన వివాదంపై అచ్చెన్నాయుడు త‌న‌దైన శైలిలో చ‌లోక్తులు విసిరారు. గ‌త ప్ర‌భుత్వ హయాంలో స్పీక‌ర్‌గా ఎన్నికైన కోడెల స్పీక‌ర్‌గా ఎన్నికైన సంద‌ర్భంలో తాము స‌భా సంప్ర‌దాయాల‌ను పాటించామ‌ని గుర్తు చేశారు. కొత్త‌గా ఎన్నికైన స్పీక‌ర్‌ను కుర్చీలోబెడ‌దాం అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవ‌రైనా ఒక‌రు చెప్పి ఉంటే బాగుండేద‌న్నారు. త‌మ్మినేని సీతారాం స్పీక‌ర్‌గా ఏపీ రెండో శాస‌న‌స‌భ‌కు మంచి పేరు రావాల‌ని తాను ఆశిస్తున్న‌ట్టు చెప్పారు.