ప్ర‌మాదాల‌కు కేరాఫ్‌గా పొగ‌మంచు..!

0
121

తెలంగాణలో దట్టంగా కురుస్తున్న పొగ మంచు వాహనదారులకు చాలా ఇబ్బందులు పెడుతోంది. జాతీయ రహదారుల‌ను పొగ‌మంచు పూర్తిస్థాయిలో క‌ప్పేయ‌డంతో ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాల‌ను సైతం గుర్తించ‌డం క‌ష్టంగా మారింది. దీంతో ర‌హ‌దారుల‌పై వ‌రుస ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈరోజు తెల్లవారుజామున బెంగళూరు హైవే లో ఆరు వాహనాలు ఒకదానినొక‌టి ఢీ కొన్నాయి. పొగ మంచు కారణంగానే షాద్ నగర్ లో రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డిజిల్లా నందిగామలోను పొగ మంచు కారణంగా మూడు కారులు ఒక‌దానినొక‌టి ఢీ కొన్నాయి. ఈ పొగ మంచు కారణంగా జరిగే ప్రమాదాలతో హైవే పై ట్రాఫిక్ ఎక్కువగా స్తంభిస్తుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.