అభినంద‌న్ ఫోటోను నిరోధించాలి : మాజీ సైనికుల డిమాండ్

0
255

దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్న త‌మ‌ను కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు కించ‌ప‌రుస్తున్నార‌ని, వారు చేసే ప్ర‌య‌త్నాలు త‌మ‌ను మ‌నోవేద‌న‌కు గురిచేస్తున్నాయ‌ని 156 మంది మాజీ సైనికులు రాష్ట్ర‌ప‌తి కోవింద్‌కు లేఖ రాశారు. రాజ‌కీయ నాయ‌కులు సైనికుల‌ను దేశ ర‌క్ష‌కులుగా కాకుండా ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, అటువంటి నీతిమాలిన చ‌ర్య‌లకు రాజ‌కీయ నాయ‌క‌లు పాల్ప‌డ‌కుండా చూడాలంటూ ఆ 150 మంది మాజీ సైనికులు రాష్ట్ర‌ప‌తికి లేఖ రాశారు.

ఆ లేఖ‌లో మాజీ సైనికులు పేర్కొన్న ప్ర‌ధాన అంశాలు ఇలా ఉన్నాయి. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఆదిత్య‌నాథ్ సైనికుల వ‌స్త్రాలు, భార‌త వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ ఫోటోల‌ను ఎన్నిక‌ల ప్ర‌చార ర‌థంపై పెట్టి ప్ర‌జ‌ల‌ను ఓట్లు అడుగుతున్నార‌ని, ఆ సంఘ‌ట‌న‌లు త‌మ‌ను కించ‌ప‌ర‌చ‌డ‌మే కాకుండా, మ‌నోవేద‌న‌కు గురి చేస్తున్నాయ‌ని రాష్ట్ర‌ప‌తికి రాసిన లేఖ‌లో ఆ 150 మంది మాజీ సైనికులు పేర్కొన్నారు. అభినంద‌న్ ఫోటోను ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో ప్ర‌ద‌ర్శించ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మాజీ సైనికులు కోరారు.